ఓసి పిచిదానా అందుకే దాన్ని 'స్వర్గం' అంటారు!
భార్య : ఏమండి! స్వర్గంలో భార్య భర్తలను కలిసి ఉండనివ్వరట !?
భర్త : ఓసి పిచ్చిదానా ! అందుకే దాన్ని స్వర్గం అంటారే!
--------------------------------------------------------------------------------------------------------------------------
భర్తను ఎంత 'జాగ్రత్తగా' చూసుకోవాలి...?
మీకెవ్వరికీ ఆర్ధిక మాంద్యం విలువ తెలీట్లేదు...
పదివేలు-పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, వాషింగ్ మిషన్ లను అంత జాగ్రత్తగా చూసుకుంటారు...? పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయనివ్వరు. అలాంటిది,
లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి...?
డబ్బంటే లెక్క లేదు మీకు....ఆయ్

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రమాదకరమైన ఆట చూడాలంటే "తాళికట్టు"..!!
*"జల్లికట్టు, జల్లికట్టు" అని ఆశ్చర్యపోతావేంట్రా..
*
*అంతకంటే ప్రమాదకరమైన ఆట చూడాలంటే "తాళికట్టు"..!!*

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎర్రగులాబీ-తెల్లగులాబీ
వాలెంటైన్స్ డే నాడు భర్త భార్యకి
*తెల్లగులాబీ* ఇచ్చాడు
అదేంటి గత సంవత్సరం ఎర్రగులాబీ ఇచ్చారు, ఇప్పుడు తెల్లగులాబీ ఇస్తున్నారేంటి
అప్పుడు ప్రేమ కావాలని ఎర్రగులాబీ ఇచ్చాను.
ఇప్పుడు శాంతి కావాలని తెల్లగులాబీ ఇస్తున్నాను అర్ధంచేసుకోవాలి మరి............

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్ప్రైట్ (Sprite) తాగి వచ్చాను,అందుకే *సూటిగా మాట్లాడుతున్నా..
ఏం తాగి వచ్చావ్..?
భర్త : స్ప్రైట్ (Sprite) తాగి వచ్చాను,అందుకే *సూటిగా మాట్లాడుతున్నా.. సుత్తి లేకుండా..* ఇది క్లియర్.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పుట్టింటికి వెళ్ళిన భార్య...,తన 'భర్త కి పంపిన వాట్స్ అప్ మెసేజ్'
*** పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరినుండి వచ్చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.

*** 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది.

*** మీరు చాలా హెల్దీ గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.

*** మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పిజ్జా బిల్లులు చాలా దొరికాయి.

*** మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం.

*** పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.

*** అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?

*** మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.

*** మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి.....!!!!!!! మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు.

*** షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నువ్వు కంగారు పడకు...అది 'ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది..'
అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికి రా ...కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది...మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా..
కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు...అది ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది..
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీతా రాముడు లాగా 'ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..'?
భార్య :- ఏమండీ ! మనం కూడా సీతా రాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..?
భర్త :- మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు.
...
భార్య :-....... ఆ ఆ ???
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భర్త తెలీక మూడ్రోజుల నుండి 'శిలా విగ్రహంలా' అలాగే నిలబడ్డాడు
ఏదైనా ఛాలెంజ్ ఉంటేనే మజా!
wife; సరే అలాగే నేనోడిపోతే జీవితాంతం మీ మాటే వింటాను! మీరు ఓడిపోతే జీవితాంతం నా మాటే వినాలి ఇదీ పందెం!! ఓకే నా?
పండు (Fruit) పేరు చెబితే కుడి చెయ్యెత్తాలి! 
పొరపాటు చేస్తే మీరు ఓడిపోయినట్లే!
పోటీ మొదలయ్యింది!
బుర్ర గిర్రున తిరిగింది!
ఏచెయ్యెత్తాలో తెలీక మూడ్రోజుల నుండి శిలా విగ్రహంలా అలాగే నిలబడ్డాడు!!!
మీరైనా ఏం చెయ్యాలో చెప్పి సాటి మగాడ్ని ఆదుకోండి!!!!
ప్లీజ్
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1) శ్రీవారికి తలనొప్పిగా వుంటే మీరు మౌనం వహిస్తే చాలు, ఆయనే కోలుకుంటాడు అమృతాంజనం అక్కర్లేదు 
2) ఉదయం లేవగానే ఆయన కాళ్ళకు నమస్కరించకున్నా పర్లేదు, అతన్ని బెడ్ కాఫీ అడక్కుండా ఉంటే చాలు. 
3) వారానికి కనీసం 4సార్లు ఆయనకు భోజనం స్వయంగా వడ్డించండి. ఆ అల్ప సంతోషి ఆనందిస్తాడు 
4) మిగిలిన ఆహారం పనిమనిషికో, కుక్కకో వేసే ముందు, ఆయన తిన్నాడో లేదో చూడండి.అమాయకపు పక్షి మొహమాటం ఎక్కువ.
5) నలుగురిలో,ముఖ్యంగా ఆయనను మీ అత్త మామలను (మీ పుణ్యాన వాళ్ళు జీవించి వుంటే) చులకన చేయకండి.
6) మీ కన్నవారింటిలో పొరపాటున మీ అయన ఉండవలసి వచ్చినప్పుడు. అతనికి మీరు సేవ చేస్తున్నట్లు నటించండి. అలవాటుప్రకారం అదేశించవద్దు.
7) నెల మొదటి వారంలోనే కాక, అన్నిరోజులూ ఆయనను ప్రేమగా చూడండి, పిచ్చి మారాజు అన్ని ఆదాయాలు మీ చేతిలోనే పోస్తాడుగా.
8) అలిగి పుట్టింటికి వెళ్తానని ఉత్తుత్తినే ఆయన్ను బెదిరించకండి, కొన్నిసార్లైనా మాట నిలబెట్టుకోండి .
9) వరాలక్ష్మీవ్రతం, అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మీ ఆయనకి కూడా ఒక గుడ్డముక్క తీయండి.సంబరపడిపోతాడు
.
11) మీ బంగారు నగల్ని తరచూ మారుస్తూ మీ శ్రీవారిని ఏమార్చవద్దు.మీ అయన మనసే బంగారమని నమ్మండి . 
12) మీవారు వేరే అమ్మాయిని చూస్తే, కుళ్ళు కోకుండా ఆమెలో మీ వారికి నచ్చిన అంశాలు మీరు అలవర్చుకోండి . 
13) దిక్కుమాలిన టీవీ సీరియళ్ళు చూడడం మాని, సరదాగా మీ వారికొక ప్రేమలేఖ వ్రాయండి అందులో ఆయనలో మీకు నచ్చిన అంశాలు వ్రాయండి - కవితలు వద్దు అర్భకుడు తట్టుకోలేడు....
- ఇంకా వున్నాయి ప్రస్తుతానికివి పాటించి మీ శ్రీవారి మనసు దోచుకోండి.. పర్సును కాదు. ....

గృహిణులూ గ్రహించండి...వీలైతే పాటించండి...కనీసం గుర్తించండి... 
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నా లాంటి వాళ్ళందరూ ఒకప్పటి పట్టుదల కల్గిన భర్తలే
భర్త : స్వామి..! భార్యాభర్తల గొడవలలో ఎక్కువగా భర్తలే సర్దుకుపోతారు ఎందుకు స్వామీ.....?
సన్యాసి : తప్పదు నాయనా...! లేకపోతే భార్యలు బట్టలు సర్దుకు పోతారు....
భర్త : అంటే ఈ విషయం లో పట్టుదల గా ఉండే భర్తలే ఉండరా స్వామీ......?
సన్యాసి : నేను లేనా నాయనా...! నా లాంటి వాళ్ళందరూ ఒకప్పటి పట్టుదల కల్గిన భర్తలే......!

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
*నీకు మూగ పెళ్ళాం వస్తుందిరా* అని భయపెట్టేవారు
చిన్నప్పుడు కప్పలను రాళ్ళు పెట్టి కొడుతుంటే *నీకు మూగ పెళ్ళాం వస్తుందిరా* అని భయపెట్టేవారు.
ఎంత భయపడే వాళ్లమో ఇప్పుడు అనిపిస్తుంది
*కొట్టి ఉంటే* ఎంత బాగుండునో కదా అని

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భర్తగా బ్రతకడం కష్టంరా బాబోయ్..
భర్త :: నేను నిన్న స్కూల్ కి చేరుకోగానే, నా బార్య కాల్ చేసింది,.... " ఇవ్వాల డేట్ ఎంత" ????" .. 

నేను ఆశ్చర్యంగా ఆలోచిస్తూ చెప్పాను 11వ తారీఖు అని...
కాల్ కట్ అయ్యాక ఆలోచనలో పడ్డాను (భయం కూడా కలిగింది.. 

)..
తన పుట్టిన రోజా ఊహు?...........కాదు......నా పుట్టినరోజు కాదు ..(

).....పెళ్లి రోజు..ఊహు .... అదీ కాదు
అమ్మాయి పుట్టిన రోజా ... అదీకాదు
పోనీ బామర్దుల పుట్టినరోజులు కాని పెళ్లి రోజులు .. ఊహు
గాస్ బుకింగ్ ........ చేసేసాను
కరెంటు బిల్లు ........ కట్టేసాను
వాళ్ళ అమ్మ నాన్నలు వస్తామన్నారా అది కాదు
పోనీ ఏదైనా కొనిపెడతానని మాటిచ్చానా .. లేదే..??
మరి ఎందుకు !?
డేట్ ఎందుకు ???
ఇవే ప్రశ్నలు మదిలో ఆలోచిస్తూ లంచ్ అయ్యింది, సాయంత్రం స్కూల్ అయిపోయింది ...
🏼
🏼
ఇంటికి చేరుకున్నాను...
పాప తన బొమ్మలతో ఆడుకుంటుంది ...
అడిగాను ....
కిచెన్ లో వాతావరణం ఎలా ఉంది?
తుఫానా.. సునామినా???
పాప చెప్పింది అంత మామూలే నాన్న ఏమైంది ఎందుకు ?"
"మీ అమ్మ ఈరోజు పొద్దునే ఈ రోజు డేట్ ఎంత అని అడిగిందే ఎందుకంటావు?"
పాప నవ్వుతూ చెప్పింది ...
"ఓహ్ అదా నాన్న నేను పొద్దున్న క్యాలెండర్ లోని ఒక పేజి చింపా...
అందుకే అడిగిందేమో.."
భర్తగా బ్రతకడం కష్టంరా బాబోయ్..?

🏼
🏼
🏼
🏼
🏼
🏼
🏼
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వెదుకుతూ ..... ఇల్లంతా సర్దేసాను అంతే "
భర్త : " ఒహ్ ... డార్లింగ్! ఇల్లంతా నీట్ గా వుంది. వాట్స్ అప్ ..... పనిచెయ్యటం లేదా ఏంటీ ? "
భార్య : " అదేం కాదు లెండి "
భర్త ( ఆశ్చర్యం గా ) : " మరి "
భార్య : " నా మొబైల్ చార్జెర్ కనిపించలేదు ..... దాని కోసం వెదుకుతూ ..... ఇల్లంతా సర్దేసాను అంతే "
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అన్ని బాదంపప్పు లు ఒక్కటే టెస్ట్
భార్య : TV చూస్తూ బాదంపప్పు తినేస్తుంది
భర్త : ఒక్కదానివే తింటున్నావు బాదంపప్పు నాకూ ఇవ్వు టేస్ట్ కు అన్నాడు
భార్య : తన చేతిలో ఉన్న ఒక బాదం తీసి ఇచ్చింది
భర్త : మరీ ఒక్కటి అంటే ఒక్కటే ఇస్తావా ?
భార్య : అన్ని బాదంపప్పు లు ఒక్కటే టెస్ట్ 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భర్త ఎప్పుడో కాని నోరు తెరవడు అలా తెరిచినప్పుడు ఆపడం ఆరోగ్యానికి హానికరం
భర్త : (రొమాంటిక్ గా) బంగారం ఒక విషయం చెప్పనా..
#భార్య : భోజనం చేసేప్పుడు మాటలేంటి తినండి ముందు.
తరవాత మాట్లాడవచ్చు.
(భోజనం అయ్యాక )
#భార్య : ఇప్పుడు చెప్పు డియర్
#భర్త : ఏమి లేదు డార్లింగ్ ఇందాక నువ్వు తినే అన్నం లో ఒక బొద్దింక కనిపించింది.
నీతి : భర్త ఎప్పుడో కాని నోరు తెరవడు అలా తెరిచినప్పుడు ఆపడం ఆరోగ్యానికి హానికరం 

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భార్యాభర్తలు అంటే ఎవరు స్వామీ...?
ఆనందం 😃: భార్యాభర్తలు అంటే
ఎవరు స్వామీ...?
స్వామిజి 😇: జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్తయితే, భర్తకు భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి బ్రతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్ళే నాయనా....
😜 😝😝😝😝
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తింటే సగం రాలిపోతాయ్! తినకపోతే మొత్తం రాలిపోతాయ్
భార్య : మీ కోసం ఇడ్లీలు చేశా తినండి.
భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఇడ్లీలు తింటే సగం పళ్లు రాలిపోతాయ్!
భార్య: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయ్...
భర్త : ఆ.....
😆😆😆😆😆😆
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
'విదేశాలే' పిచ్చి మాష్టారూ.....
టీచర్: అరేయ్ ప్రపంచం లో దేశాలు
ఎన్ని ఉన్నాయ్ రా?
చింటూ:మీకెమన్నా పిచ్చా మాష్టారూ? ప్రపంచం లో దేశం ఒకటే ఉంది.. భారత
దేశం.. మిగతావన్నీ 'విదేశాలే' పిచ్చి మాష్టారూ.....
😂😂😂😂

మొదటిసారిగా విదేశం వెళ్ళిన మహిళ ఎవరు?
టీచర్ః--భారత దేశం నుంచి మొదటిసారిగా విదేశం వెళ్ళిన మహిళ ఎవరు?’’
విద్యార్ధిః--సీత టీచర్. శ్రీలంక వెళ్ళింది.’’
టీచరు ఇంకా కోమా నుండి బయటకి రాలేదు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పెళ్ళంటే ఎంటీ సామీ...? "పోవడం " నాయనా...
పెళ్ళంటే ఎంటీ సామీ...?
"పోవడం " నాయనా...
"అంటే పైకి పోవడమా సామీ.."
దీన్నే తొందరపాటు అంటారు
పోవడం అంటే....
వణికి పోవడం...
సర్దుకు పోవడం...
అణిగి పోవడం...
వొదిగి పోవడం....లాంటివిరా అర్భకుడా...😜😜😜😜😜
No comments:
Post a Comment